శ్రీవాణి టెక్నో స్కూల్ లో ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

నవతెలంగాణ – సిద్దిపేట
పట్టణంలోని భారత్ నగర్ లోగల శ్రీవాణీ టెక్నో స్కూల్లో బుధవారం  రాఖీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి.  విద్యార్థినిలు విద్యార్థులకు స్వీట్లు తినిపిస్తూ రాఖీలు కట్టారు. తమ శ్రేయస్సు కోరుతూ రాఖీలు కట్టడం పై విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పాఠశాల కరెస్పాండెంట్ సి హెచ్. సత్యం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా పాఠశాలలో  రాఖీ పండుగ విశిష్టత గురించి విద్యార్థులకు  తెలిపడంతోపాటు, సామాజిక అంశాలపైన అవగాహన కల్పిస్తున్నామని , రాఖీ పండుగా దేశ వ్యాప్తంగా జరుపుకునే పండుగని, “నేను నీకు రక్ష నీవు నాకు రక్ష”  “మనమందరం దేశానికి రక్ష” అని దేశభక్తి చాటుతూ ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు ,తదితరులు పాల్గొన్నారు.
Spread the love