Tuesday, August 25, 2026
E-PAPER
Homeఖమ్మంఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ 

ఏఐటీయూసీ జిల్లా ఉప ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ 

- Advertisement -

– ఉపాధ్యక్షురాలిగా రాజ్యలక్ష్మి 
– సహాయ కార్యదర్శిగా సుధాకర్
నవతెలంగాణ-సత్తుపల్లి 

ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఖమ్మం జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరీగా సత్తుపల్లి పట్టణానికి చెందిన నిమ్మటూరి రామకృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈనెల 23, 24 తేదీలలో సత్తుపల్లి పట్టణంలోని లక్ష్మీ ప్రసన్న గార్డెన్స్ లో రెండు రోజుల పాటు జరిగిన ఏఐటీయూసీ జిల్లా 17వ మహాసభలలో ఈ ఎన్నిక జరిగినట్లు రామకృష్ణ తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నిమ్మటూరి రామకృష్ణ మాట్లాడుతూ.. సంఘ బలోపేతానికి శక్తివంతం లేకుండా కృషి చేస్తానని తెలిపారు. అలాగే జిల్లా సహాయ కార్యదర్శిగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ బ్రాంచ్ కార్యదర్శిగా పనిచేస్తున్న సముద్రాల సుధాకర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఉపాధ్యక్షురాలిగా సత్తుపల్లి మండలంలో  మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికురాలు జి.రాజ్యలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -