రూ.50 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొంటున్నారు: రామకృష్ణారెడ్డి

MLAs are being bought by paying Rs. 50 crores: Ramakrishna Reddy– రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగింది..
– సాగుచేసిన ప్రతి ఒక్క రైతుకు  రైతుబంధు అమలు చేయాలి….
– హామీలు అమలు చేయాలని ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తాం…
– బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి ఒక్క ఎమ్మెల్యేకు 50 కోట్ల రూపాయలు ఇచ్చి, బతిమిలాడి కొనుగోలు చేస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. బుధవారం బి ఆర్ ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి తో కలిసి  నిర్వహించి, మాట్లాడారు. రేవంత్ రెడ్డి సర్కార్ రైతు రుణమాఫీ రైతుబంధు విషయం అభిప్రాయ సేకరణ పేరుతో నాటకాలు ఆడుతుందని,  సాగుచేసిన ప్రతి రైతుకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గతంలో బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు తెలంగాణ అభివృద్ధిని చూస్తూ, పార్టీని పట్టించుకోకపోవడం, చిన్నచిన్న పొరపాట్ల వల్ల ఎన్నికలలో ఓడిపోవడం జరిగిందని, ఎన్నికలలో గెలుపోవటములు సహజమని అన్నారు. కాగా గతంలో బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎన్నికలను చేర్చుకొని పొరపాటు చేశామని, అందుకే ప్రజలు జీర్ణించుకోలేదన్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కూడా మేము చేసిన  పొరపాటును పునరావృతం చేస్తుందని, వారికి ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయగా నెలలో ప్రాంతంలో సీఎం మంత్రులు ఎమ్మెల్యేలు పూర్తిగా విఫలమయ్యారని, ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందన్నారు.  సీఎం రేవంత్ రెడ్డి రైతు బంధు, రైతు బీమా, ఆసరా, దళిత బంధు, మహాలక్ష్మి తులం బంగారం, అమ్మాయిలకు స్కూటీ, నిరుద్యోగ భృతి, గిరిజన భృతి,  తోపాటు ఏ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని విమర్శించారు.
మూసి ప్రక్షాళన కోసం రూ.70000 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, రైతులకు రైతుబంధు పై ప్రజాప్రతి సేకరణ ఎందుకని, రైతులపై సీఎంకు ప్రేమ ఉందని నిలదీశారు. సీఎం గతంలో ఒక మాట ప్రస్తుతం ఒక మాట సీఎం గతంలో ఒక మాట ప్రస్తుతం ఒక మాట మాట్లాడుతున్న సీఎం పరిపాల కోతలేని వ్యక్తిని ఆయన పరిపాలనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని లేనియెడల ప్రజాక్షేత్రంలో మోసపూరిత విధానాలపై ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించి,  ప్రజా పోరాటాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. గతంలో త్రాగునీరు, కరెంటు ప్రజలకు ఎలాంటి అంతరాయం లేకుండా లభించేదని ప్రస్తుతం తాగునీరు కూడా సరిగా లభించడం లేదన్నారు. ఇసుక అక్రమ రవాణా ఎమ్మెల్యేలకు ఒక వరంలా మారిందని ఆరోపించారు. తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలో యాదాద్రి ఫ్లవర్ ప్లాంట్ కు ఒక రోజుకు 50 లారీల చొప్పునని పర్మిషన్ తీసుకొని, మిగతా 300 లారీలను హైదరాబాద్కు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో క్రైమ్ రేటు పెరిగిందని, ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పది సంవత్సరాల లోపు రెండు క్రైమ్ రేటు  ఇప్పుడు ఎలా పెరిగిందని, సెక్రటేరియట్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు 10:30 కు పోతే ఎవరూ రాలేదని, 11:30 వరకు కూడా కేవలం 15% మాత్రం మనదే వచ్చారని, ప్రభుత్వ అసమర్థత కారణంగా ప్రభుత్వ యంత్రాగం పనిచేయడం లేదని ఆరోపించారు. పరిపాలన చేతగాని అసమర్ధులని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జడల అమరేందర్ గౌడ్, కొలుపుల అమరేందర్, సుదగాని హరి శంకర్, కల్లూరి రామచంద్ర రెడ్డి, కంచి మల్లయ్య, ఎనబోయిన ఆంజనేయులు, ఏవి కిరణ్ కుమార్, జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్ రెడ్డి, పటికం లక్ష్మీనారాయణ, ఇట్టబోయిన గోపాల్, తాడెం రాజశేఖర్ తాడూరి బిక్షపతి  లు  పాల్గొన్నారు.
Spread the love