నవతెలంగాణ-నవాబు పేట
రామానంద చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ యెన్మంగండ్ల రమేష్ చారి, కామునిపల్లి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో యెన్మంగండ్ల ప్రాథమిక పాఠశాల ఆవరణలో రూ.2 లక్షల వ్యయంతో సిమెంట్ ఫ్లోరింగ్ పనులు చేపట్టి పూర్తి చేశారు.ఈ అభివృద్ధి కార్యక్రమంలో గ్రామ మహిళా సంఘం, మహిళా అధ్యక్షురాలు అనూష స్కూల్ చైర్మన్, దర్శన్ గౌడ్, తెలుగు లక్ష్మయ్య, పుల్య బాలయ్య, జమ్ము వహీద్, శేఖర్, రియాజ్, నర్సిములు, కేశవులు, అబ్దుల్లా గార్లతో పాటు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులకు మరింత మెరుగైన వాతావరణం కల్పించేందుకు చేపట్టిన ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన రామానంద చారిటబుల్ ట్రస్ట్, కామునిపల్లి చంద్రశేఖర్ రెడ్డికి ప్రతి ఒక్కరికీ యెన్మంగండ్ల గ్రామ ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
యన్మంగండ్ల పాఠశాలకు రామానంద తీర్థ చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



