హైకోర్టులో రామోజీరావు, శైలజాకిరణ్‌కు ఊరట

నవతెలంగాణ -హైదరాబాద్: మార్గదర్శి కేసులో చైర్మన్ రామోజీరావు, ఎండీ శైలజాకిరణ్‌కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. సీఐడీ కేసులో తదనంతర చర్యలన్నీంటిపై హైకోర్టు స్టే ఇచ్చింది. 8 వారాలపాటు అన్ని చర్యలు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది. క్వాష్ పిటిషన్‌పై కౌంటర్ వేయాలని సీఐడీకి ఆదేశాలు ఇచ్చింది. విచారణ డిసెంబర్ 6కు వాయిదా వేసినట్లు హైకోర్టు పేర్కొంది. సీఐడీపై ఏపీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. మీపరిధిలో లేకున్నా కేసు ఎందుకు నమోదు చేశారని కోర్టు ప్రశ్నించింది. ఈ కేసుకి, చిట్ ఫండ్ కేసుకి సంబంధమేంటని హైకోర్టు నిలదీసింది. చిట్ ఫండ్ కేసు అయితే అది చిట్‌ఫండ్ చట్టం కిందకు వస్తుంది కదా అని హైకోర్టు సీఐడీని ప్రశ్నించింది.

Spread the love