
భువనగిరి పట్టణ శివారులోని రాయగిరిలో సహృదయ అనాధ వృద్ధాశ్రమంలో మంగళవారం రోజున బత్తిని రాములు గౌడ్ (స్వామి) పుట్టినరోజు సందర్భంగా” వారి కుటుంబ సభ్యులు ఆధ్వర్యంలో “సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమంలో” నివసిస్తున్న 51 మంది అనాధ వృద్ధులకు, మానసిక వికలాంగులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాములు గౌడ్ కుటుంబ సభ్యులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఆశ్రమంలోనీ వృద్ధుల సమక్షంలో కేక్ కట్ చేసి పుట్టిన రోజు వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బత్తిని వినోద, బత్తిని వాసవి శ్రీధర్ గౌడ్, భక్తులు ఆకుల శ్రీను, పెరుమెల్లి తిరుమలేష్, కోల వెంకటేష్ గౌడ్, పాక జహంగీర్, బత్తిని వెంకటేష్, ఉపేందర్, సంతోష్, వెలిమినేడు వెంకటేష్ , డీజే రవి కిరణ్, సంస్థ వ్యవస్తాపకుడు బుషపాక శివకుమార్,ఆశ్రమ నిర్వాహకులు సంతోష్ , లక్ష్మణ్ లు పాల్గొన్నారు.