హోటల్లు, రెస్టారెంట్లపై ఆకస్మిక తనిఖీలు

– ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడితే చర్యలు
– జిల్లా  ఇంచార్జ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి. స్వాతి
నవతెలంగాణ నల్గొండ కలెక్టరేట్ 
నల్లగొండ  జిల్లా  కేంద్రంలోని పలు హోటల్స్  రెస్టారెంట్లపై జిల్లా  ఇంచార్జ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పి. స్వాతి శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీలో భాగంగా అపరిశుభ్రంగా ఉన్న వంట  గదులను పరిశీలించి వారికి నోటీసులు అందజేశారు.  స్టోర్ రూమ్ లో 5000 రూపాయల విలువగల  ఎక్స్పైడ్ ప్రొడక్ట్స్ ను  తొలగించారు.అలాగే  రంగులు కలిపిన ఆహార పదార్థాలు, సాస్ బాటిల్లను, పెరుగు, అల్లము లాంటి  అనుమానిత ఆహార నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం హైదరాబాదులో గల  ల్యాబ్ కి పంపించారు. రిపోర్ట్స్ కల్తీ అని తేలితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని ఫుడ్ ఇన్స్పెక్టర్ స్వాతి తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా  హోటలలో అపరిశుభ్రత కలిగిన  కల్తీ ఆహారం విక్రయించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఇకపై తరచుగా ఆకస్మిక దాడులు కొనసాగుతాయని విక్రయదారులు ముఖ్యంగా హోటల్స్ నడిపేవారు ప్రజలకు నాణ్యమైన కల్తీ లేని ఆహారాన్ని అందించాలని లేనిచో వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఫుడ్ సేఫ్టీ  సిబ్బంది పాల్గొన్నారు.
– పేరుకే ఫుడ్ సేఫ్టీ అధికారి..!.. తూతు  మంత్రంగా తనిఖీలు..
నల్లగొండ జిల్లా లో ఫుడ్ సేఫ్టీ అధికారి ఉన్న లేనట్టే. నామమాత్రంగా తనిఖీలు చేస్తూ అందిన కాడికి దండికుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, పత్రిక విలేకరులకు  అందుబాటులో ఉండరు. ఎప్పుడు ఫోన్ చేసినా కూడా ఫోను ఎత్తరు అనే విమర్శలు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే మా ఫోన్ కూడా ఎత్తదు అని కార్యాలయ సిబ్బంది కూడా పేర్కొనడం గమనార్హం. ఇలాంటి అధికారులు ఉంటే ఎంత లేకుంటే ఎంత అని ప్రజలు నిర్మొహమాటంగా వాపోతున్నారు. ఉన్నతాధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదనకు గురవుతున్నారు.
Spread the love