Monday, April 27, 2026
E-PAPER
Homeజాతీయంసహజీవనం తర్వాత అత్యాచారం కేసులు స‌రికాదు:సుప్రీంకోర్టు

సహజీవనం తర్వాత అత్యాచారం కేసులు స‌రికాదు:సుప్రీంకోర్టు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: మోసపూరిత ఉద్దేశం ఉంటేనే నేరం కిందకు వస్తుందని, సహజీవనం తర్వాత అత్యాచారం కేసులు పెట్టడం సరికాదని సుప్రీంకోర్టు ధర్మాసనం తెలిపింది. బ్రేక్-అప్ తర్వాత లైంగిక దాడి ఆరోపణలు వర్తించవని పేర్కొంది. పరస్పర అంగీకారంతో కూడిన సంబంధం నేరం కిందకు రాదని న్యాయస్థానం తేల్చిచెప్పింది. పెళ్లి చేసుకోలేదని కక్షపూరితంగా కేసులు పెట్టడం సరికాదని ధర్మాసనం సూచించింది. తప్పుడు వాగ్దానం, విఫలమైన వాగ్దానాల మధ్య తేడాను గుర్తించాలని కేసు విచారణ సందర్భంగా పిటిషనర్‌కు తెలిపింది. ఈ మేరకు మహారాష్ట్ర న్యాయవాదిపై నమోదైన అత్యాచారం కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -