నవతెలంగాణ-మిడ్జిల్
మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకులు మావిళ్ళ వెంకటయ్య, బరిగల బుచ్చయ్య బీఆర్ఎస్ జిల్లా నాయకులు బాల్ రెడ్డి, బాలు సమక్షంలో సోమవారం మండల కేంద్రంలో చేరారు. ఈ సందర్భంగా వారికి బిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా జిల్లా నాయకులు బాల్ రెడ్డి, బాలు మాట్లాడుతూ.. అన్ని వర్గాల ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందని చెప్పారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని రాబోవు రోజుల్లో అధికారంలోకి వస్తుందని భీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పాండు మాజీ ఎంపీపీ సుదర్శన్, జంగారెడ్డి, ఉప సర్పంచ్ల సంఘం మాజీ మండల అధ్యక్షులు మతిన్, గంజి కృష్ణ, సుకుమార్, నామిని శ్రీనివాసులు, వెంకటయ్య రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ నుంచి బీర్ఎస్ లో చేరిక
- Advertisement -
- Advertisement -



