నవతెలంగాణ-మిడ్జిల్
పురుగుల మందు తాగి బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని మంగల్ గడ్డ గ్రామపంచాయతీ పరిధిలోని లాక్యా తండాలో చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. లాక్యా తండాకు చెందిన మహేష్ (14) ఆదివారం వారి వ్యవసాయ పొలం వద్ద పురుగుల మందు తాగాడు. అయితే అది గమనించిన వ్యవసాయ రైతులు వెంటనే బాలుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న మహేష్ తలిదండ్రులు మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి బాలుడు మృతి చెందినట్లు ఎస్సై శివ నాగేశ్వర్ నాయుడు తెలిపారు. బాలుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా బాలుడి మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
పురుగుల మందు తాగి బాలుడు మృతి
- Advertisement -
- Advertisement -



