
– మండలంలో ముగ్గురివల్లే కాంగ్రెస్ పార్టీకి మేజారీటీ
– పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే కార్యకర్తలే కావాలని సూచన
– కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో బీఆర్ఎస్ విఫలమైందని అసహనం
– తక్కువ సమయంలో ప్రజావ్యతిరేకతను ఎమ్మెల్యే కూడట్టుకున్నాడని ఆరోపణ
నవతెలంగాణ – బెజ్జంకి
నిజాయితీగా పనిచేసే వారు పనిచేయండి.. నమ్మకంగా ఉండేవారు నమ్మకంగా ఉండండి.. వీలుకాని వారు పార్టీకి పనిచేసిన వారిని చెడగొట్ట వద్దని..పార్టీకి నిజాయతీగా పనిచేస్తేనే అన్ని విధాలుగా గుర్తింపు ఉంటుందని మానకొండూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సూచించారు.శనివారం మండల కేంద్రంలోని సత్యార్జునా గార్డెన్ యందు బీఆర్ఎస్ రాష్ట్రాధ్యక్షుడు కేసీఆర్ కరీంనగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించ తలపెట్టిన కదనభేరి సన్నహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్టాడారు.బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మండలాభివృద్ధికి శాయశక్తుల కృషి చేశామన్నారు.మండలంలో కనీస ఆదరణ లేని సమయంలో ఇద్దరు,ముగ్గురు పార్టీ శ్రేణులు సోషల్ మీడియా ద్వార బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టి నేడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సుమారు నాలుగు వేల మేజారీటీ ఓట్లు సాధించిపెట్టారని వాపోయారు. గతంలో సుమారు రూ.5.32 కోట్ల నిధులను మండలంలోని అయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిందని..అభివృద్ధి పనులను రద్దు చేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీఆర్ఎస్ శ్రేణులు విఫలమయ్యారని అసహనం వ్యక్తం చేశారు.పార్టీలో కొనసాగుతూ పార్టీకి నమ్మకద్రోహం చేసే వారుగా పనిచేయవద్దని.. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచే కార్యకర్తలే కావాలని సూచించారు.ఇప్పటికైనా కార్యకర్తలు పార్టీ కోసం సమిష్టిగా పని చేసి కుల సంఘాలు,మహిళ సంఘాల సభ్యులతో సంఘటితమై రాబోయే ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎన్నికకు కష్టపడి పని చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.మండల బీఆర్ఎస్ నాయకులు,అయా గ్రామాల కార్యకర్తలు హజరయ్యారు.
తక్కువ సమయంలో ఎమ్మెల్యేకు ప్రజా వ్యతిరేకత: అతి తక్కువ సమయంలో ఈ వ్యక్తికి ఓట్లేందుకు వేశామనే ప్రజావ్యతిరేకతను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ కూడగట్టుకున్నాడని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు.ఎంపీ బండి సంజయ్ నియోజకవర్గానికి చేసిన అభివృద్దేమి లేదని ఆరోపించారు.