– మెదక్ అదనపు ఎస్‌పీ (అడ్మిన్) మహేందర్
నవతెలంగాణ-హవేలి ఘనపూర్
సార్వత్రిక ఎన్నికల దష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం మెదక్ కామారెడ్డి జిల్లా సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద మెదక్ జిల్లా అదనపు ఎస్‌పీ (అడ్మిన్) ఎస్.మహేందర్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. ఆదివారం మండల పరిధిలోని పోచమ్మ రాల్ చెక్‌పోస్ట్ వద్ద జిల్లా ఎస్పీ పి.రోహిణి ప్రియదర్శిని ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల దష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను చేపట్టడం జరుగుతుందని జిల్లా అదనపు ఎస్‌పీ (అడ్మిన్) మహేందర్ తెలిపారు. అక్రమంగా నగదు, మద్యం, మాదకద్రవ్యాల రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లాలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు. హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధి పోచమ్మరాల్ వద్ద ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టులను సందర్శించి అక్కడ విధులలో ఉన్న అధికారులు, సిబ్బందికి తగు సూచనలు చేశారు. అనంతరం మెదక్ డీఎస్‌పీ ఫణిందర్, మెదక్ రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, హవేలీ ఘనపూర్ ఎస్‌ఐ ఆనంద్ గౌడ్, ఏఎస్‌ఐ సమీహుద్దీన్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.