మరో లగచర్లలా మారనున్న సిద్దాపూర్
కాంగ్రెస్ ను నమ్మేస్థితిలో ప్రజలు లేరు
రాజీనామాలు చేసి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి
ప్రభుత్వంపై గిరజనుల కన్నెర్ర
నవతెలంగాణ-కొత్తూరు
‘హఠావో.. హఠావో.. డంపింగ్ యార్డ్ హఠావో.. బచావో.. బచావో.. సిద్దాపూర్ బచావో..’ రంగారెడ్డి జిల్లా కొత్తూరు అంటూ సిద్ధాపూర్ గడ్డపై గిరిజనులు కన్నెర్ర జేశారు. సిద్దాపూర్ డంపింగ్ యార్డ్ ఏర్పాటు నేపథ్యంలో ఆదివారం కొడిచర్ల తండా ఉప సర్పంచ్ స్వప్న రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో సుమారు 200 మంది గిరిజనులు డంపింగ్ యార్డ్ ప్రాంతాన్ని పరిశీలించి, ప్రభుత్వ తీరును ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల కోసం నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వం అందించిన అసైన్ భూములను సేకరించి టీజీఐసీసీకి అప్పజెప్పిందని అన్నారు. పరిశ్రమలు రావాల్సిన చోట కాంగ్రెస్ ప్రభుత్వం ఏకో టౌన్ షిప్ పేరుతో డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు, సర్పంచులు రాజీనామా చేసి తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. సంబంధిత అధికారులు, మంత్రులతో డంపింగ్ యార్డ్ పై సానుకూలమైన ప్రకటన చేయించి, ప్రజలకు ధైర్యాన్ని అందించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పెద్దలపై ఉందన్నారు. మండల తహసీల్దార్ తమకు ఎలాంటి సమాచారం లేదని చెప్తుంటే మరోవైపు కాంగ్రెస్ నాయకులు సంబంధిత మంత్రి, అధికారులకు ఆర్జీలు అందించడం ఏంటనీ ప్రశ్నించారు. కమిటీలతో సమస్య పరిష్కారం కాదనన్నారు. పార్టీలో ఉంటే ఉద్యమం నడపలేమన్నారు. పార్టీలకతీగతంగా ముందుకు వచ్చి ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు. డంపింగ్ యార్డ్ ప్రకటన ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోని పక్షంలో మరో లగచర్ల ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు బిచ్చ నాయక్, మాజీ ఎంపీటీసీ కిషన్ నాయక్, వార్డు సభ్యులు సంతోష్ నాయక్, వినోద్ నాయక్, భాస్కర్ నాయక్, శంకర్ నాయక్, రాము నాయక్, సుమల నాయక్, గోపాల్ నాయక్, రగయా నాయక్, లక్ష్మణ్ నాయక్, వెంకటయ్య నాయక్, సూర్య నాయక్, దాస్య నాయక్, శంకర్ నాయక్, భద్రు నాయక్, బాబు నాయక్, దేవు నాయక్, యువకులు తదితరులు పాల్గొన్నారు.



