బీటీపీఎస్‌ రోడ్డుకు మరమ్మతులు చేయండి

నవతెలంగాణ-మణుగూరు
మణుగూరు సీఎస్‌పీ నుండి బీటీపీఎస్‌ వరకు రోడ్డు మరమ్మతులు నిర్వహించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు సత్ర పల్లి సాంబశివరావు డిమాండ్‌ చేశారు. శనివారం విలేకరులతో మాట్లాడుతూ మండలంలో సీఎస్‌పీ దగ్గర నుండి బీటీపీఎస్‌ వరకు ఉన్న ప్రధానరహదారి (ఏటూర్‌ నాగారం) పూర్తిగా గుంటలు రహదారి ధ్వంసం అయిందని అన్నారు. బొగ్గు, ఇసుక లారీలు రహదారిపై ప్రధానంగా తిరగటం వలన పూర్తిగా ధ్వంసమైందన్నారు. స్థానిక ఎమ్మెల్యే, అధికారులు ఏమీ చేయలేకపోయారని, మాటలు చూస్తే బారెడు చాతలు మట్టుకు చారడన్నట్టుగా రహదారిని పట్టించుకున్న పాపాన లేదన్నారు. ఆ రహదారిపై ఎన్నో రోడ్డు ప్రమాదాలు, ఎంతోమందికి గాయాలు జరిగిన సందర్భాలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా రహదారి మరమ్మతులు చేయించి ప్రజల ప్రాణాలను కాపాడాలని, లేని పక్షంలో పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకోలు, ధర్నాలు చేస్తామని తెలియపరిచారు.

Spread the love