మద్దికుంట రోడ్డు మరమ్మతులు చేయండి

నవతెలంగాణ – రామారెడ్డి

మండలంలోని మద్దికుంట- ఇస్సన్న పల్లె, మద్దికుంట నుండి మర్రి వరకు తారు రోడ్డు పూర్తిగా గుంతల ఏర్పడటంతో, జిల్లాలో ప్రముఖ దేవాలయం శ్రీ స్వయంభు బుగ్గ రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజు వాహనాల్లో వందల మంది భక్తులు వస్తుంటారు.
గ్రామంలో 3000 మందికి పైన జనాభ ఉంటుంది. జిల్లా కేంద్రనికి 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.గ్రామ ప్రజలు ప్రతి పనికి మండల కేంద్రానికి, జిల్లా కేంద్రానికి ప్రతిరోజు వెళ్తుంటారు. బీటి రోడ్డు పూర్తిగా తొలగిపోయి, గుంతలు, కంకర తేలడంతో ప్రయాణికులకు, భక్తులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ప్రయాణికులు వాహనాలు అదుపుతప్పి అనేక ప్రమాదాలు జరిగాయి. ప్రజల, భక్తుల సౌకర్యార్థం ప్రభుత్వం వెంటనే స్పందించి రోడ్డు మరమ్మత్తును చేపట్టాలని భక్తులు, గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Spread the love