
రాష్ట్ర ప్రభుత్వ ‘నూతన చిహ్నం పై పలు సూచనలు చేస్తూ ధర్మ సమాజ్ పార్టీ యదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏఓ జగన్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కన్వినర్ నల్ల నరేందర్ మహారాజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నాన్ని మారుస్తూ, ఆ స్థానంలో కొత్త చిహ్నం తీసుకురావాలని ప్రకటించడాన్ని గమనించామని, దీన్ని ధర్మ సమాజ్ పార్టీ స్వాగతిస్తుందని అన్నారు. వివిధ పార్టీల నుండి, సంస్థల నుండి కూడా ప్రతిపాదనలు తమ ప్రభుత్వం స్వీకరిస్తున్నంధున ధర్మ సమాజ్ పార్టీ నుండి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిహ్నాన్ని ప్రతిపాదిస్తున్నామని తెలిపారు.
మేము ప్రతిపాదిస్తున్న చిహ్నంలోని గొప్పతనం ఏమిటంటే ప్రపంచంలోనే ప్రసిద్ధి గాంచిన ఉస్మానియా యూనివర్సిటీని దాని నుండి గౌరవ డాక్టరేట్ తీసుకున్న భారత రాజ్యాంగ నిర్మాత డా. అంబేడ్కర్ ని ఈ చిహ్నంలో ఉంచామని తెలిపారు. ఇది మన తెలంగాణ ప్రజలు గర్వించదగ్గ ఎంతో గంభీరమైన విషయం అన్నారు. అగ్రవర్ణ భూస్వామ్య పాలకవర్గం పై అణగారిన వర్గాల రాజ్యం కోసం, హక్కుల కోసం యుద్ధం చేసిన పండగ సాయన్న, సర్దార్ సర్వాయి పాపన్న, సమ్మక్క సారలక్కల చిత్రాలను కూడా ఈ తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదిత చిహ్నం లో ఉంచామని తెలిపారు.
ఈ ప్రతిపాదిత చిహ్నంలో ఉంచిన ఈ ఆరు చిత్రాలు సమాజంలో సమానత్వ భావనని, పీడిత వర్గాల యోధుల పోరాట స్ఫూర్తిగా, భావి తరాల తెలంగాణ ప్రజలకు స్ఫూర్తి అవుతుందనారు. తెలంగాణ వైభవోపేతమైన సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక అవుతుందని తెలిపారు. ఈ చిహ్నాన్ని తమ ముందు (తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందు) ధర్మ సమాజ్ పార్టీ నుండి ప్రతిపాదిస్తున్నామని తెలియజేశారు. తప్పకుండా దీనిని ఆమోదించి మీకు మీ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పట్ల సమానత్వ భావన ఉందని తెలియ జేయండని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు గాలయ్య, లింగస్వామి, మహేష్, రాకేష్, శాంతి కుమార్, శ్రీకాంత్, సురేష్, వెంకటేష్, శ్రీకాంత్ లు పాల్గొన్నారు.