నవతెలంగాణ-భిక్కనూర్
తెలంగాణ విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులు తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రిని శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ అధ్యాపకులు మాట్లాడుతూ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రెగ్యులరైజ్ పక్రియ చేయడం గురించి తమ వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ అధ్యక్షులు డాక్టర్ పరశురాం, యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఫస్ట్ ప్రొఫెసర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్ నారాయణ గుప్తా, తెలంగాణ విశ్వవిద్యాలయ అధ్యక్షులు డాక్టర్ దత్త హరి, డాక్టర్ శరత్, డాక్టర్ నాగేశ్వరరావు, డాక్టర్ గంగా కిషన్, డాక్టర్ కిరణ్ రాథోడ్, సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.