కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఎంపీ చామల కు వినతి..

Request to MP Chamala to print Ambedkar's photo on currency notes..నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  స్ఫూర్తి ప్రదాత  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, 1921 లో ఇంపీరియల్ బ్యాంకు కుప్పకూలినప్పుడు  1923 లో “రూపాయి దాని సమస్య- పరిష్కార మార్గం” అనే పుస్తకాన్ని వ్రాసి హిల్టాన్ యంగ్ కమిషన్, సైమన్ కమిషన్, రాయల్ కమిషన్ కు ఇవ్వడం వల్ల నాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ను ఏర్పాటు చేసారని, ఆనాడు అంబేద్కర్ లేకుంటే నేడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లేదని , అలాంటి నాయకుని ఫోటోని కరెన్సీ నోట్లపై ముద్రించే విధంగా, పార్లమెంటులో మాట్లాడాలని భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కి, కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం కరెన్సీ పై అంబేద్కర్ ఫోటో సాధన సమితి జాతీయ అధ్యక్షులు డాక్టర్ జేరిపోతుల పరశురామ్ ఆద్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  ఫోటోను కరెన్సీ నోట్లపై ముద్రించాల్సిన బాధ్యత  కేంద్ర ప్రభుత్వంపైన, ఆర్బిఐ పైన ఉందని ఎం పి అన్నారు. ఈ అంశంపై పార్లమెంట్లో మాట్లాడతానని, ఈనెల 29,30,31తేదీలలో ఢిల్లీ జంతర్ మంతర్ లో  జరిగే “మహాధర్నాకు” హాజరవుతానని ఎంపీ  హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. భువగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చిన వారిలో  కరెన్సీ నోట్ల పై  అంబేద్కర్ ఫోటో  సాధన సమితి  యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్  కొడారి వెంకటేష్, గౌరవాధ్యక్షులు   బట్టు రామచంద్రయ్య, జిల్లా ఎస్సీ /ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బర్రె సుదర్శన్, తెలంగాణ దళిత సేన రాష్ట్ర అద్యక్షులు పల్లెర్ల వెంకటేష్, నాయకులు నల్ల కృష్ణ, కుడుదుల సత్యనారాయణ లు పాల్గొన్నారు.
Spread the love