– కుక్కలు, కోతల బెడద నుంచి కాపాడాలి
– గ్రామ సభ తీర్మానం
నవతెలంగాణ-లింగంపేట్
పురాతమైనటువంటి కట్టుకాలువ పూడికతీత పనులకు శ్రీకారం చుట్టాలని గ్రామ సచివాలయంలో నిర్వహించిన గ్రామసభలో శుక్రవారం తీర్మానం చేశారు. కట్టు కాలువ చెత్తాచెదారంతో కూడికపోయిందని దీంతో చెరువులోకి నీరు పోవడం లేదన్నారు. చెత్త చెదరం పేరుకు పోయి కాల్వలు పనిచేయడం లేదని, దాని వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారని తెలిపారు. శాశ్వతంగా పనులు ఇరిగేషన్ శాఖ వారు సకాలంలో స్పందించి పూర్తిగా కాలువ నిర్మాణం పనులు చేపట్టినట్లయితే ఆయకట్టు రైతులకు మేలు జరుగుతుందన్నారు. చెరువులలోకి నీరు కట్టుకోలపై ఆధారపడి పంటలు సాగు చేసే రైతులకు నీరు పుష్కలంగా వస్తుందన్నారు. గ్రామంలో కోతుల బెడద తీవ్రంగా ఉందని ఇంట్లో చొరబడి విలువైన వస్తువులను ధ్వంసం చేస్తున్నాయన్నారు. పలురుపై దాడికి ప్రయత్నం చేస్తున్నాయని, అదేవిధంగా కుక్కలు అధికంగా ఉండడంతో రాత్రివేళ దారి గుండా వెళ్లాలంటే ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కుక్కలు, కోతుల బెడద నివారించాలని గ్రామస్తుల సమక్షంలో తీర్మానం చేశారు. పారిశుధ్యం లోపించకుండా రోడ్లపై చెత్త చెదరన తొలగించాలన్నారు. విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. ఇంటింటికి మరుగుదొడ్లు ఉపయోగించుకోవాలని. వనమహౌత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని తీర్మానం చేశారు. మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ప్రత్యేక అధికారుల అధ్యక్షతనలో గ్రామసభలను నిర్వహించారు. ప్రజలు రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పలు అంశాలపై తీర్మానం చేశారు. ఈ గ్రామ సభలో ఎంపీడీవో నరేష్, ఎంపీఓ మలహరి, ఎమ్మార్వో నరేందర్, ఏపీఎం శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్ కుమార్, అశ్వక్, కార్యదర్శులు ఆయా శాఖలో చెందిన అధికారులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.