పెన్షనర్ల సమస్యలను పరిష్కరించండి

నవతెలంగాణ – కంటేశ్వర్
అపరిష్కృతంగా నున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జూలై 4 ,5 ,తేదీలలో డివిజన్ కేంద్రాలలో ధర్నా కార్యక్రమాలను నిర్వహించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ &రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా లో నిజామాబాదు, ఆర్మూరు, బోధన్, ఆర్డిఓ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్టు జిల్లా అధ్యక్షులు కే. రామ్మోహన్రావు,ప్రధాన కార్యదర్శి
ఎస్ .మదన్మోహన్, కోశాధికారి ఈవీఎల్ నారాయణ, నిజామాబాద్ అధ్యక్ష, కార్యదర్శులు  సిర్ప హనుమాన్లు ,అందే సాయులు, శుక్రవారం జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో తెలిపారు.  పి .ఆర్. సి. కమిటీని వేసి జూలై నుండి అమలు చేయాలని, పెండింగ్ డీ.ఏ.లను విడుదల చేయాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ ను పట్టిస్ట ఇష్టపరచాలని, మార్కెటింగ్ సంస్థ, ఎయిడెడ్ సంస్థలలో, లైబ్రరీలలో అమలు చేయాలని, నగదు రహిత వైద్యాన్ని అన్ని కార్పొరేట్, ప్రైవేటు ఆసుపత్రులలో అమలు చేయాలని, తదితర డిమాండ్ల సాధన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. విలేకరుల సమావేశంలో గౌరవాధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు, జిల్లా నాయకులు భోజరావు, దీన సుజన, రాధా కిషన్ తదితరులు పాల్గొన్నారు.

Spread the love