నవతెలంగాణ కథనానికి స్పందన..

– సముదాయంలోని దుకాణాలకు టెండర్లు..
– టెండర్ల అదాయం రూ.2,30,000..
నవతెలంగాణ – బెజ్జంకి 
మండల పరిధిలోని బేగంపేట గ్రామంలో ఆనందయ్య మఠం స్థలంలో నిర్మించిన దుకాణాల సముదాయాలకు ఎట్టకేలకు మోక్షం లభించింది. డిసెంబర్ 25,2023న ‘నిర్మించారు..వినియోగం మర్చారు’శీర్షీకతో నవతెలంగాణ దినపత్రిక కథనాన్ని ప్రచురించిందిఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్  పైడిపాల మల్లేశం అధ్వర్యంలో దుకాణాల సముదాయంలోని ఆరు దుకాణాలకు ఆసక్తికలిగిన వ్యాపారస్తుల నుండి బుధవారం టెండర్లు స్వీకరించారు.రెండెండ్ల కాలపరిమితికి దుకాణానికి రూ.2,500 అద్దె చోప్పున టెండర్ల ద్వార రూ.2,30,000 ఆదాయం సమకూరినట్టు అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.ఏప్రిల్ 1న టెండర్ దారులకు దుకాణాలను అందజేస్తామని కమిటీ సభ్యులు తెలిపారు.
నవతెలంగాణ కథనంతో చలనం: సముదాయంలోని దుకాణాలపై వచ్చే అదాయంలో గ్రామ పంచాయతీకి కొంతమేర వాటాను కేటాయించాలని అప్పటి పంచాయతీ పాలకవర్గం నిర్ణయించడంతో వివాదం తలెత్తింది.మఠానికి చెందిన స్థలంలో నిర్మించిన దుకాణాలపై గ్రామ పంచాయతీకి వాటను కేటాయించాలనే నిర్ణయాన్ని పలువురు గ్రామస్తులు వ్యతిరేకించడంతో వివాదం డీపీఓ వద్దకు చెరింది.నూతన ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు.నూతన కమిటీ సభ్యులు సముదాయంలోని దుకాణాల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేసి అధికారుల అనుమతుల మేరకు దుకాణాలను టెండర్లను స్వీకరించారు.
Spread the love