నవతెలంగాణ కథనానికి స్పందన..

– ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించిన జిల్లా అదనపు  కలెక్టర్…
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
యాదాద్రి భువనగిరి జిల్లాలో తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని రైతుల ఆందోళన చెందుతున్నారని నవతెలంగాణ పత్రికలో మినీ కథనం బుధవారం  ప్రచురితం  కావడంతో స్పందించిన జిల్లా అదనపు  కలెక్టర్ పి బేన్ షాలోమ్ బుధవారం సాయంత్రం దాన్యం కొనుగోలు పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థలభావ కొరత వలన కొనుగోలు కొంత ఆలస్యం జరిగిందని తెలిపారు. భువనగిరి మండలంలోని సూరెపల్లి, రెడ్డి నాయక్ తండ, బీబీనగర్ మండలంలోని  గూడూరు రైతుల గ్రామాల ఆందోళన ఉద్దేశించి మాట్లాడారు.  యాదాద్రి భువనగిరి జిల్లాలో మిల్ పాయింట్లు వద్ద స్థలం లేకపోవడంతో , దానిని అధిగమించడానికి సమీప జిల్లాలు నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు దాన్యం తరలిస్తున్నట్లు తెలిపారు. బుధవారం నుంచి జనగామ హనుమకొండ జిల్లాలకు 30,000 మెట్రిట్ టన్నుల ధాన్యం పంపించినట్లు, లారీల కొలత లేదని ఎన్నికల దృశ్య కేంద్రాల మిల్లులకు తగినంత మంది హమాలీలు లేక జాప్యం జరిగిందని తెలిపారు. కొనుగోలు కేంద్రాల వద్ద అకాల వర్షంతో ఇబ్బందులు పడకుండా టార్పాలిన్లు ఏర్పాటు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేశారు.
Spread the love