నవతెలంగాణ వార్తకు స్పందన..

– పాఠశాలలో మద్యం సీసాల తొలగింపు 

– స్పందించిన పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి 
నవతెలంగాణ – బెజ్జంకి 
పాఠశాలనా?..మద్యం సేవించే స్థలమా?అనే శీర్షికతో నవతెలంగాణ దినపత్రిక మంగళవారం వార్తను ప్రచురించింది. వార్తకు స్పందించిన పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి పాఠశాల అవరణంలో మద్యం సీసాల అనవాళ్లను గ్రామ పంచాయతీ పారిశుధ్య సిబ్బందితో తొలగించారు.పాఠశాలలో చోటుచేసుకుంటున్న అసాంఘిక కార్యకలాపాలపై పంచాయతీ కార్యదర్శికి పాఠశాల బోధన సిబ్బంది తమగోడును వెళ్లబోసుకున్నారు.పాఠశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
అభద్రత వలయంలో బాలికల పాఠశాల..
మండల కేంద్రంలో నడిబొడ్డున ఉన్న బాలికల ప్రభుత్వోన్నత పాఠశాల అభద్రత వలయంలో కొట్టుమిట్టాడుతొంది.గత రెండు రోజుల క్రితం బాలికల ప్రభుత్వోన్నత పాఠశాల భవనంలోని బోధన సిబ్బంది కార్యాలయ గది వెంటీలేటర్ అద్దాలను గుర్తుతెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసి పగులగొట్టారు. మూత్రశాలకు రక్షణగా నిలిచే తలుపులకు రంద్రాలు చేశారు. దీంతో పాఠశాల మహిళ బోధన సిబ్బంది భయబ్రాంతులకు గురవుతున్నారు.పాఠశాలలో స్కావెంజర్స్,పీఈటీ లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దీనికితోడు బాలికల ప్రభుత్వోన్నత పాఠశాల అవరణంలోకి గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడం విస్మయానికి గురిచేస్తుందని సిబ్బంది వాపోతున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రత్యేక నిఘా ఏర్పాటుచేసి బాలికల ప్రభుత్వోన్నత పాఠశాలను సంరక్షించాలని బోధన సిబ్బంది విజ్ఞప్తి చేశారు.
Spread the love