ఉపాధ్యాయుల దశాబ్దాల కల నెరవేర్చిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి

నవతెలంగాణ ఆర్మూర్: ఉపాధ్యాయుల దశాబ్దాల కల నెరవేర్చిన ఏకైక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని పి ఆర్ టి యు నాయకులు పెంట జలంధర్, పిడి లు మంచిర్యాల సురేష్ కుమార్, శ్యామ్, గోపి లు కొనియాడారు. 30 ఏళ్లుగా నోచుకోని భాషా పండితులు పదోన్నతులకు నోచుకోని ఎస్జీటీలు, స్కూల్ అసిస్టెంట్లకు అవాంతరాలను అధిగమించి పదోన్నతులు కల్పించారని బదిలీలకు అవకాశం ఇచ్చారని తెలిపారు .రాష్ట్రంలో 22,000 మంది భాషా పండితులకు స్కూల్ అసిస్టెంట్ గా పదోన్నతులు వచ్చాయని, 60 వేల మంది టీచర్లు తాము ఉన్నచోట నుంచి మరొక ప్రదేశానికి బదిలీ కానున్నారని వారు తెలిపారు.

Spread the love