బాధిత కుటుంబానికి బియ్యమందజేత..

నవతెలంగాణ – బెజ్జంకి 

మండల పరిధిలోని లక్ష్మిపూర్ గ్రామానికి చెందిన బోనగిరి బక్కయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. శనివారం స్థానిక అంబేడ్కర్ యువజన సంఘం సభ్యులు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాలర్పించారు. అనంతరం తమ వంతు సహాయంగా 25 కిలోల బాధిత కుటుంబ సభ్యులకు బియ్యమందజేశారు. సంఘాధ్యక్షుడు బోనగిరి వెంకటేశ్,సభ్యులు బోనగిరి శంకర్,బోనగిరి రవి తదితరులు పాల్గొన్నారు.
Spread the love