రోడ్డు యమ డెంజర్.. జర్నీ జర భద్రం

నవతెలంగాణ – జుక్కల్:
మండలంలోని నాగల్ గావ్ గ్రామము నుండి పడంపల్లి వెళ్లే బీటీ రోడుపైన ఇటివల కురిసిన వర్షానికి పెద్ద పెద్ద గుంతలు ఏర్పడటంతో అందరూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. ద్విచక్రవాహనాలదారులకు, బస్సులలో ప్రయాణించే వారికి తీవ్ర ఇబ్బందు ఎదుర్కొంటున్నారు. ఈ గుంతల కారణంగా రోడ్డుప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని గ్రామస్థులు తెలుపుతున్నారు.  రోడుపక్కనే పోలం ఉన్న ఓ  రైతు పంటకు రసాయన మందు పిచకారీ చేసిన తరువాత రోడుపైన  పడిన  గుంతతో ప్రమాదాలు  జర్గుతాయని ఆలోచించి పిచకారీ చేసిన మందు ప్లాస్టిక్ బ్యాగ్ ను కట్టేకు కట్టి గుంత దగ్గర జాగ్రత్తగా వెళ్లాలని గుర్తుగా పెట్టడం జర్గింది.  పదేండ్ల క్రితం నిర్మాణం చెసిన బీటీ రోడు నేడు గుంతల  మయంగా మారింది. రాత్రి పూట గుంతలను వాహనదారులు గుర్తించక పోవడంతో పలు ప్రమాదాలు  చోటుచేసుకున్న  సంఘటనలు అనేకమని పలు గ్రామాల వారు వాపోయారు. ప్రజల అవసరాలను గుర్తించని ప్రజా ప్రతినిధులు రోడ్ల వేయాలనే సోయి లేకుండా గ్రామీణ ప్రాంత రోడు దరిద్రంగా కావడంతో  సమస్యలు వస్తున్నాయని, సంభందిత అధికారులు పట్టించుకోవడంలేదని వాహనదారులు, యువకులు అంటున్నారు. ఇప్పడికైన సంబంధిత అదికారులు రోడుపైన ఉన్న గుంతను పూడ్చి వేసి, మార్గం సుగుమం చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.

Spread the love