హైదరాబాద్‌లో రోజ్‌గార్‌ మేళా

– నియామక పత్రాలు అందజేసిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి
నవతెలంగాణ – హైదరాబాద్‌
ప్రధాని నరేంద్ర మోడీ హామీ అమలులో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహించిన రోజ్‌గార్‌ మేళాలో భాగంగా మంగళవారం హైదరాబాద్‌లో 6వ రోజ్‌గార్‌ మేళా నిర్వహించారు. పివిఆర్‌ కన్వెన్షన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. బ్యాంకులు, రైల్వే, పోస్టల్‌, మిథాని, డిఆర్‌డివొ, సిబిఐసి, ఆదాయ పన్ను శాఖ తదితర ప్రభుత్వ రంగ సంస్థల్లో సెలెక్టయిన అభ్యర్ధులకు మంత్రి కిషన్‌ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో ఎస్‌బిఐ సిజిఎం అమిత్‌ జింగ్రాన్‌, ఎస్‌ఎల్‌బిసి కన్వినర్‌ దేబాశిష్‌ మిత్ర,ఎస్‌బిఐ జిఎం మంజు శర్మ, తదితర ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Spread the love