Thursday, September 17, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతుల ఖాతాల్లో రూ.1,129 కోట్లు

రైతుల ఖాతాల్లో రూ.1,129 కోట్లు

- Advertisement -

12.38 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరణ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్‌

రైతుల నుంచి పౌరసరఫరాల శాఖ సేకరించిన 12.38 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యానికి సంబంధించిన రూ.1,129 కోట్ల రూపాయలను వారి ఖాతాలకు బదిలీ చేసింది. ఈమేరకు శనివారం పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ ఎం. స్టీఫెన్‌ రవీంద్ర ఒక ప్రకటన విడుదల చేశారు. దాదాపు 1.54 లక్షల మంది రైతులకు డబ్బులు అందాయని తెలిపారు. ప్రస్తుతం 8,575 వరి కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి వరి ధాన్యాన్ని సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందులో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నిర్వహణలో 4,455 కేంద్రాలు, ఇందిరా క్రాంతి పథం ఆధ్వర్యంలో 3,563 కేంద్రాలు, మిగిలిన 557 కేంద్రాలను ఇతర సంస్థలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. దీని ఫలితంగా 5.07 లక్షల మెట్రిక్‌ టన్నుల సన్నరకం, 7.31 లక్షల మెట్రిక్‌ టన్నుల దొడ్డురకం ధాన్యాన్ని సేకరించినట్టు వెల్లడించారు. నిజామాబాద్‌, నల్లగొండ, కామారెడ్డి, సూర్యాపేట, కరీంనగర్‌, జగిత్యాల, మెదక్‌, యాదాద్రి భువనగిరి, పెద్దపల్లి, సిరిసిల్ల జిల్లాల్లో కొనుగోలు కార్యకలాపాలు పూర్తి స్థాయిలో జరుగుతున్నాయని పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -