ఆగివున్న టిప్పర్ను వెనుక నుంచి ఢీ కొట్టిన ఆర్టీసి

– బస్సు ముగ్గురికి గాయాల
– క్రేన్ లకు తాడు కట్టే సమయం లో క్రెన్ డ్రైవర్ క్రెన్ మరొక క్రెన్ మధ్యలో ఇరుక్కొని మృతి
– టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం
నవతెలంగాణ -పెద్దవూర
టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ఆగివున్న టిప్పర్ ను వెనుక నుంచి ఆర్టీసి బస్ ఢీ కొట్టిన సంఘటలో ముగ్గురికి గాయాలు కాగా క్రెన్ ల సహాయం తో వాహనాలను తీస్తుండగా క్రెన్ డ్రైవర్ కింద పడి మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి పెద్దవూర మండలం నాగార్జున సాగర్ హైదరాబాద్ జాతీయ రహదారి పై తుంగతుర్తి స్టేజీ సమీపంలో చోటుచేసుకుంది. ఎస్ఐ అజ్మీర రమేష్ తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి 12 గంటల సమయం లో మాచర్ల డిపో కు చెందిన ఏపి 07-జెడ్ -0580 నంబర్ గల సూపర్ లగ్జరీ బస్సు డ్రైవర్,
37 మంది ప్రయానికులను తీసుకొని హైదరాబాద్ కు వెళ్తుండగా రాత్రి 12.00 గంటల సమయంలో పెద్దవూర మండల పరిధిలో తుంగతుర్తి గ్రామం స్టేజి వద్ద టిప్పర్ లారీ బ్రేక్ డౌన్ అవడం వల్ల లారీ డ్రైవర్ టిప్పర్ ను నిర్లక్ష్యంగా రోడ్డు దించకుండా పార్క్ చేసి వెళ్ళిపోయాడు. అది గమనించని ఆర్టీసి బస్సు డ్రైవర్ ఆగివున్న టిప్పర్ ను వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో బస్ డ్రైవర్ తో పాటు మరో ముగ్గురు ప్రయాణికులకు స్వల్ప గాయాలు అయినాయి. ఆసమయం లో ఢీ కొట్టు కున్న బస్సును, టిప్పర్ను రెండు క్రెన్ ల సహాయం తో తీస్తుండగా అందులో ఒక క్రైన్ డ్రైవర్ బీహార్ కు చెందిన విజయకుమార్ చౌరస్య (40) టిప్పర్ లారీకి తాళ్ళు కడుతుండగా ప్రమాదవ శాత్తు అతడు క్రెన్ మధ్యలో ఇరుక్కొని పోయి అక్కడికక్కడే మృతి చెందారు. ఇట్టి విషయంలో మృతుడి తమ్ముడు అజయ్ చౌరస్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభిస్తునామని తెలిపారు.మృతుడికి భార్య, ఒక కుమారుడు,కుమార్తె వున్నారు. మృతుడు సుంకిశాల ప్రాజెక్ట్ లో క్రేయిన్ ఆపరేటర్ గా పని చేస్తున్నారని, అతని కుటుంబ సభ్యులు బీహార్ లో వుంటున్నారని పోలీసులు తెలిపారు. బ్రేక్ డౌన్ అయిన టిప్పర్ ను రోడ్డు డించకుండా రోడ్డు మీద పార్కు చేసి వెళ్లిపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Spread the love