
మండలంలోని ధర్మారం గ్రామానికి చెందిన పల్లపు సాయిలు 3 ఉద్యోగాలు సాధించాడు. ధర్మారం గ్రామానికి చెందిన పల్లపు పోశెట్టి గౌరమ్మల కుమారుడైన చిన్న సాయిలు గురుకుల పీజీటీ, టీజీటీ సోషల్లతో పాటు టీఎస్ పీఎస్ సీ విడుదల చేసిన గ్రూప్- 4 లో సైతం మంచిర్యాంకు సాధించాడు. పీజీటీ సోషల్ లో రాష్ట్రస్థాయి ఏడవ ర్యాంకు, మల్టీ జోనల్ ఒకటిలో మొదటి ర్యాంకు సాధించాడు. సాయిలు విద్యాభ్యాసం అంతా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే పూర్తి చేసి రెండు సంవత్సరాలుగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. వారం రోజుల వ్యవధిలోనే మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సాయిలుకు కుటుంబ సభ్యులు, ఆత్మీయులు, గ్రామస్తులు అభినందనలు తెలిపారు.