IPL : ఈ సారి సుదర్శన్ వంతు..చెన్నైకి భారీ టార్గెట్

నవతెలంగాణ-హైదరాబాద్ : ఐపీఎల్ ఫైనల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ బ్యాటింగ్ ముగిసింది. గుజరాత్ నిర్ణిత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. దీంతో చెన్నైకి 215 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ జట్టు ఓపెనర్లు మంచి ఆరంభం ఇచ్చారు. ఆరంభం నుంచి దూకూడుగా ఆడారు. 67 పరుగలు వద్ద (గిల్) 39 అవుట్ అయ్యాడు. ఆ తరువాత సహా మెరుపులు మెరిపించగా 131 పరుగుల వద్ద 54 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక క్రీజులో ఉన్నా సాయి సుదర్శన్ (96) చెన్నై బౌలర్ల మీద విరుచుకుపడ్డాడు. ఫోర్లు, సిక్స్ లతో విద్వంసం సృష్టించాడు. అతనికి తోడుగా పాండ్యా 21 పరుగులు చేశాడు. దీంతో గుజరాత్ స్కోరు 214 పరగులు చేసింది. ఇక చెన్నై బౌలర్లలో పతిరణ రెండు వికెట్లు తీయగా జడేజా, చహర్ చెరో వికెట్ తీశారు. 215 పరుగుల భారీ లక్ష్యంతో చెన్నై బరిలోకి దిగనుంది. 215 పరుగులు చేజ్ చేసి కప్ గెలుస్తుంది.. లేదా చెన్నైని కట్టడి చేసి గుజరాత్ గెలుస్తుందా చూడాలి.

Spread the love