కామ్రేడ్ ఎండి. జహంగీర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: సాయిబాబు

నవతెలంగాణ – భువనగిరి
భువనగిరి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్న కామ్రేడ్ ఎండి. జహంగీర్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సీపీఐ(ఎం) జాతీయ నాయకులు సాయిబాబు పిలుపునిచ్చారు. సోమవారం భారత ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం, లౌకిక రాజ్యాంగ హక్కుల కోసం, సామాజిక న్యాయం కోసం, దేశ ఆర్థిక స్వావలంబన కోసం జరిగే కీలకమైన ఎన్నికల్లో ప్రజలు బిజెపి ఓడించి, సీపీఐ(ఎం) ను గెలిపించాలని, సీపీఐ(ఎం) జాతీయ నాయకులు సాయిబాబా పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో భువనగిరి నియోజకవర్గ బాధ్యుల సమావేశం సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యురాలు బట్టుపల్లి అనురాధ అధ్యక్షతన జరుగగా, ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా సాయిబాబా హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచి 20 కోట్ల నిరుద్యోగాన్ని బీజేపీ పెంచిందని ఘాటుగా విమర్శించారు. మోడీ సర్కార్ మల్లి గ్యారెంటీ అని ఈ ఎన్నికల్లో బోగస్ ప్రచారం నిర్వహించడాన్ని నిరసించారు. నరేంద్ర మోడీ పరిపాలన విధ్వంసకర పాలనగా సాగిందని అందుకే ప్రజా సమస్యల గురించి ప్రస్తావన లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుల, మత, ప్రాంతీయ వైశాల్యాలను రెచ్చగొడుతూ మరోసారి అధికారానికి రావాలని చూస్తున్నారు. ప్రజలు గత పది సంవత్సరాలు బీజేపీ అప్రజా స్వామీక పరిపాలనతో విసుగు చెంది ఓట్లు వేయడానికి కూడా ముందుకు రావడంలేదని, దీనికి బీజేపీ దుర్మార్గపాలని ప్రధాన కారణమని విమర్శించారు. మూడోసారి హ్యాట్రిక్ కోసం ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థుల్ని అడుగడుగునా ప్రజలు నిలదీస్తున్నారని, బీజేపీ ఓటమి ఇప్పటికే కాయమైందని, రాబోయే ఐదు దశల ఎన్నికల్లో ప్రజా తీర్పు విలక్షణంగా ఉండబోతుందని అన్నారు. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడించాలని, సీపీఐ(ఎం) అభ్యర్థి జహంగీర్  సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు భాస్కర్, రాష్ట్ర కమిటీ సభ్యులు జె.వెంకటెష్, కొండమడుగు నర్సింహ, రాష్ట్ర నాయకులు మూడు శోభన్ నాయక్, ఆశలత, మాధవి,రాములు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాటూరి బాలరాజు, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నర్సింహ, మాయ కృష్ణ , పగిళ్ల లింగారెడ్డి , ఎస్ ఎప్ ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, సీపీఐ(ఎం) నాయకులు పల్లెర్ల అంజయ్య, ప్రసాదం విష్ణు పాల్గొన్నారు.
Spread the love