కలుషిత భోజనం తిని విద్యార్థులు అస్వస్థత గురి..

– పురుగుల బియ్యం తింటున్న విద్యార్థులు
– పట్టించుకోని అధికారులు
– విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన
నవతెలంగాణ – కోదాడరూరల్
కలుషిత భోజనం తిని విద్యార్థుల అస్వస్థతకు గురైన సంఘటన అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్న భోజనం అనంతరం  పదిమంది విద్యార్థులు అస్వస్థత గురయ్యారు. ప్రధానోపాధ్యాయుడు పర్యవేక్షణ లేకుండా పాఠశాలకు రాకుండా విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండడంతో ఈ దారుణం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులను గట్టిగా నిలదీశారు. ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని పాఠశాలకు రాకుండా హాజరు రిజిస్టర్లో సంతకాలు పెట్టుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలోని బియ్యాన్ని పరిశీలిస్తే మొత్తం పురుగులు ఉన్నాయని ఇలాంటి బియ్యాన్ని విద్యార్థులకు ఎలా పెడతారని తల్లిదండ్రులు వాపోతున్నారు. భోజనం సరిగా ఉండడం లేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అసలు పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులే ఎటు వెళ్తున్నారు అని పలువురు ఆరోపిస్తున్నారు. పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉండడంతో ఈ దారుణం జరుగుతుందని తల్లిదండ్రులు వాపోయారు విద్యార్థులను స్థానికులు చికిత్స నిమిత్తం వైద్యశాలకు తరలించారు.పాఠశాలను ఇంఛార్జి ఎంఈఓ సలీమ్ పరిశీలించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Spread the love