ఓయూలో ఘనంగా సాయిచందు వర్ధంతి.

Saichandu celebrated his birthday in OU.– అంసా ఆధ్వర్యంలో
న‌వ‌తెలంగాణ‌; ఓయూ;-
కవి, గాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు సాయిచంద్ ప్రథమ వర్ధంతి సభ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో అల్ మాల స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఓయూ అధ్యక్షులు నామ సైదులు అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంచాల లింగస్వామి, గాజుల ప్రభాకర్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ..
“త్యాగాల తెలంగాణ గడ్డమీద సాహిత్యానికి పాటకి ఆటకి గజ్జకి ప్రాణం ఉన్నదని తెలంగాణ కళాకారుడు సాయి చందు మరోసారి నిరూపించాడు. తన రాజకీయ ప్రస్థానం అరుణోదయ సంస్థ నుండి మొదలై తెలంగాణ సాంస్కృతిక సంస్థతో చివరి మజిలీ వరకు నడిచిన ఎక్కడ కూడా తన ప్రగతిశీల భావజాలాన్ని అంబేద్కర్ భావజాలాన్ని వదిలిపెట్టలేదు సాక్షాత్తు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చివరికి రాష్ట్ర అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్న వేదికల మీద కూడా సాయి చందు తన గలాన్ని వినిపించాడు.నిన్ను నన్ను కన్న తల్లి భారతమ్మ ఒక్కటే నీకు నాకు మధ్య ఈ కులం గోడలు ఏందిరా అని చాలా వేదికల మీద మనువాదాన్ని తన గొంతుతో ప్రశ్నించాడు. అంబేద్కర్ లేనిదే రాజ్యాంగం లేదు రాజ్యాంగం లేనిదే మనకు హక్కులు లేవు అని ప్రతి వేదిక మీద అనర్గళంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. లక్షల మంది జనాన్ని కూడా తన ఆటతో మాటతో గంటల తరబడి కట్టిపడేసే నైజం సాయి చందుది. తనకు తన కుటుంబానికి ఎలాంటి రాజకీయ వారసత్వం లేకుండా వచ్చి మొక్కవోని ధైర్యంతో తెలంగాణ రాష్ట్రమంతా తిరిగి కళాకారులను కూడగట్టి ప్రజలను చైతన్యవంతం చేసి స్వరాష్ట్ర సాధనలో కీచిన్న వయసులోనే ఆనాటి ప్రభుత్వంలో గిడ్డంగుల శాఖకు చైర్మన్ గా వ్యవహరిస్తూనే గుండెపోటుతో సాయిచంద్ మరణించి అప్పుడే సంవత్సరం గడిచిపోయింది. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద ఏర్పాటు చేయాలి. సాయి చందు ఆశయాలను కొనసాగించడం అంటే ప్రజలకు అండగా నిలబడడమని అన్నారు. ఈ వర్ధంతి కార్యక్రమంలో తెలంగాణ తెలంగాణ స్టూడెంట్ పొలిటికల్ జాక్ ప్రెసిడెంట్ వలిగొండ నరసింహ, రాహుల్, AISF నాయకులు క్రాంతి, టిఆర్ఎస్వి రాష్ట్ర నాయకులు, జంగయ్య, పవన్ దేవాన్ష్, పార్ధు కళ్యాణ్, సతీష్, నగేష్, శివ వివిధ విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

Spread the love