‘సలార్’ స్పెషల్ పోస్టర్ రిలీజ్

నవతెలంగాణ – హైదరాబాద్: పాన్ ఇండియా స్టార్స్  ప్రభాస్.. పాన్ ఇండియా  దర్శకుడిగా క్రేజ్ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ సలార్. ఇప్పుడు నెట్టింట చర్చ మొత్తం ఈ ‘సలార్’ సినిమా గురించే. అసలు ఈ సినిమా ఇప్పట్లో విడుదలవుతుందా అని ప్రేక్షకులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే తరచూ రిలీజ్ డేట్లలో మార్పులు చేయడంతో సలార్ ఫ్యాన్స్​కు నిరాశ తప్పడం లేదు. అయితే తాజాగా మలయాళ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ బర్త్ డే సందర్భంగా ‘సలార్’ టీం స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. సినిమాలోని ‘వర్ధరాజా మన్నార్’ పాత్రలో నటించిన కింగ్ పృధ్విరాజ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అని రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘సలార్’ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తుండగా.. పృధ్విరాజ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 22న రిలీజ్ కానుంది.

Spread the love