ప్రభాస్ ‘ఆదిపురుష్​’ జై శ్రీ రామ్​ ఫుల్ సాంగ్..

నవతెలంగాణ-హైదరాబాద్ : టాలీవుడ్​ స్టార్ హీరో ప్రభాస్ లీడ్​ రోల్​లో తెరకెక్కుతున్న మైథలాజికల్​ మూవీ ‘ఆదిపురుష్​’. ఇప్పటికే రిలీజైన టీజర్​, ట్రైలర్​తో సినిమాపై అభిమానులకు ఓ రేంజ్​లో అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ సినిమాకు ఆయువులా జై శ్రీ రామ్​ సాంగ్​ విశేషాదరణను సంతరించుకుంది. మహిమాన్విత మంత్రం నీ నామం అంటూ సాగే ఈ సాంగ్​ చిన్న గ్లింప్స్​ ఫ్యాన్స్​కు గూస్​బంప్స్​ తెప్పించగా.. తాజాగా ఈ సాంగ్​ ఫుల్ వెర్షన్ బయటకి వచ్చింది. అయితే ఈ సాంగ్ మొత్తం ఓ రేంజ్​లో ఉందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. లిరిక్స్​, మ్యూజిక్​, విజువల్స్​ ఇలా అన్నీ ఈ సాంగ్​లో హైలైట్​గా ఉన్నాయని కామెంట్లు పెడుతున్నారు.

Spread the love