నకిలీ విత్తనాల విక్రయ ధారులపై ఉక్కుపాదం మోపుతం…

– వ్యవసాయ, పోలిస్, టాస్క్ ఫోర్స్ హెచ్చరిక..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండల కేంద్రాలతో పాటు ఆయా గ్రామాలలో గల విత్తన విక్రయ ధారుల దుకనాలను వానకాలం సీజన్ ప్రారంభం ముందు ప్రభుత్వ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాల నిర్మూలనలో బాగంగా టాస్క్ ఫోర్స్ బృందం, పోలీస్, వ్యవసాయ అధికారులు సామూహికంగా తనిఖీలు చేశారు. ఈ తనిఖీలలో నిజామాబాద్ రూరల్ ఎడిఎ ప్రదీప్ కుమార్,డిచ్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణ, ఎస్ఐ లు కచ్చకాయల గణేష్,బి నరేష్, మండల వ్యవసాయ అధికారులు రాంబాబు, ప్రవీణ్ కుమార్ లు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎవరైనా నకిలీ విత్తనాలను విక్రయిస్తే అలాంటి వారిపై రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉక్కుపాదం మోపుతమని హెచ్చరించారు.నఖిలి విత్తనాలను అరికట్టేందుకు ఇలాంటి ఆకస్మిక తనిఖీలు జరుపుతున్న మని వివరించారు.లైసెన్స్, సర్టిఫైడ్ విత్తనలను విత్తన ద్రవీకరణ విత్తన లను మాత్రమే రైతులు సదరు డీలర్ నుండి కోనుగోలు చేసినప్పుడు దానికి సంబంధించిన రసీదు పొంది కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. నకిలీ విత్తనాలు ఎవరైనా విక్రయించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డీలర్లు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినట్లయితే వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు సీజన్ ప్రారంభమవు తున్నందున రైతులు ఎవరు కూడా నకిలీ విత్తనాల బారిన పడకుండా లైసెన్స్ ఉన్న డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలని విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు తప్పనిసరిగా రసీదు తీసుకోవాలని పంట కాలం పూర్తయ్యే వరకు రసీదును జాగ్రత్తగా తమవద్ద ఉంచుకోవాలని వారు అధికారులు కోరారు. ఎవరైనా గ్రామాలలో లైసెన్స్ లేకుండా విత్తనాలు అమ్మడానికి వస్తే వ్యవసాయ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Spread the love