అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ దినోత్సవం

నవతెలంగాణ – కంటేశ్వర్
అంతర్జాతీయ లీగల్ మెట్రాలజీ దినోత్సవం ఈ సందర్భంగా సుభాష్ నగర్ రైతు బజార్ ఆవరణలో జరిగినది ఈ యొక్క కార్యక్రమంలో నిజామాబాద్ లీగల్ మెట్రాలజీ జిల్లా ఇన్స్పెక్టర్ సుజాత అలీ అధ్యక్షతన సమావేశం శనివారం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా పుడ్ సేఫ్టీ అధికారి టి నాయక్ పాల్గొన్నారు. జిల్లా వినియోగదారుల సమాచార కేంద్రం చైర్మన్ మయవార్ రాజేశ్వర్ మాట్లాడుతూ.. వినియోగదారులు తూనికల కొలతల్లో మోసాలు జరిగితే ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేసిన ఎక్స్ప్రెస్ డేట్ వస్తువులు అమ్మిన పెట్రోల్ బంకుల్లో మోసాలు జరిగిన లేబుల్ లేని వస్తువుల అమ్మిన సంబంధిత శాఖ అధికారులకు తెలియజేయాలని వినియోగదారులు వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా వ్యాపారస్తుని వద్ద నుండి బిల్లులు అడిగి తీసుకోవాలని రాజేశ్వర్ వినియోగదారులకు తెలిపారు. అదే విధంగా జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ నాయక్ వివిధ షాపులను తనిఖీ చేయడం జరిగింది అంతర్జాతీయ లీగల్ మెట్రోలోజి దినోత్సవం సందర్భంగా కొన్ని షాపులను లీగల్ మెట్రాలజీ తూనికలు కొలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించి శ్రీ లక్ష్మీ గణపతి కిరాణా మర్చంట్ రైతు బజార్ నైన్ టి రైతు బజార్ పికిల్స్ షాప్ మరియు అశోక హైపర్ మార్కెట్ పై మూడు కేసులు నమోదు చేయడం జరిగింది అని ఆయన తెలిపారు. ఈ యొక్క కార్యక్రమంలో అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ రవీందర్ కానిస్టేబుల్ సురేందర్ వినియోగదారుల ప్రతినిధులు రమేష్ గంగాధర్ లీగల్ మెట్రాలజీ సిబ్బంది ఫుడ్ సేఫ్టీ శ్రీనివాస్ ముఖ్యంగా ఫుడ్ సేఫ్టీ మొబైల్ వ్యాన్ దాని ప్రత్యేకత గురించి ఫుడ్ సేఫ్టీ అధికారి నాయక్ ప్రజలకు కల్తీ జరిగితే ఏ విధంగా మొబైల్ వ్యాన్ ఉపయోగపడుతుందని వినియోగదారులకు తెలియజేశారు. లీగల్ మెట్రాలజీ అధికారులు తూనికల కొలతలకు సంబంధించినటువంటి డెమోను ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రదర్శించినారు ఈ కార్యక్రమంలో వినియోగదారులు పాల్గొన్నారు.

Spread the love