ధర్మ సంస్థాపన కోసం..

ప్రభాస్‌, కృతిసనన్‌ జంటగా నటించిన సినిమా ‘ఆదిపురుష్‌’. ఓం రౌత్‌ డైరెక్షన్‌లో రామాయణ ఇతిహాస నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ రావణుడు పాత్రలో, హనుమంతుడి పాత్రలో సన్నీ సింగ్‌ నటిస్తున్నారు. శ్రీ రామనవమి సందర్భంగా ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది మూవీ టీమ్‌. శ్రీరామ ధర్మాన్ని మరోసారి చాటిచెప్పేలా, అందుకు తగ్గట్టుగానే శ్రీ రాముడి నైజాలైన ధర్మం, ధైర్యం, త్యాగం వంటి అంశాలు పోస్టర్‌లో ప్రతిబింబించేలా ఈ పోస్టర్‌ ఉంది. యూవీ క్రియేషన్స్‌ వంశీ, ప్రమోద్‌లతో కలిసి టి- సిరీస్‌, భూషణ్‌ కుమార్‌, క్రిషన్‌ కుమార్‌, ఓం రౌత్‌, ప్రసాద్‌ సుతార్‌, రెట్రోఫైల్స్‌ రాజేష్‌నాయర్‌ నిర్మించారు. జూన్‌ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Spread the love