హృదయం ముక్కలైంది

క్షతగాత్రులకు అండగా నిలబడాలని అభిమానులకు తారలు పిలుపు
శుక్రవారం రాత్రి ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం యావత్‌ దేశాన్ని కలిచివేసింది. క్షేమంగా ఇంటికి తిరిగివస్తారనుకున్న తమ వాళ్ళు ఇక రారని తెలుసుకున్న కుటుంబ సభ్యుల ఆవేదన వర్ణణాతీతం. ఈ విషాదం గురించి తెలిసిన ప్రతి ఒక్కరి మనసు చెదిరి, గుండె బరువెక్కింది.
ఈ పెను ప్రమాదంలో ఇప్పటివరకూ 278 మంది మతి చెందగా, 900 మందికి పైగా గాయాల పాయ్యారు. ఈ మహా విషాదంతో సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి గురయ్యారు.
మతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆశించడమే కాకుండా అవసరమైన సేవలను అందించాలంటూ తమ అభిమానులకు సోషల్‌ మీడియా వేదికగా పలువురు సినీ తారలు పిలుపునిచ్చారు.
రైలు ప్రమాద ఘటన గురించి తెలుసుకుని దిగ్భ్రాంతికి గురయ్యాను. ప్రస్తుతం క్షతగాత్రుల ప్రాణాలను కాపాడటానికి రక్తం ఎంతో అవసరం. కాబట్టి ఘటన జరిగిన ప్రాంతానికి సమీపంలో ఉన్న అభిమానులు అందరూ దయచేసి రక్తదానం చేయండి. సహాయక చర్యలు చేపట్టండి.
– చిరంజీవి
ఒడిశా రైలు ప్రమాదం గురించి తెలియగానే హదయం ముక్కలైంది. ఎన్నో కుటుంబాలు తమ ప్రిమయైనవారిని కోల్పోయారు. గాయాల పాలైనావారు త్వరగా కోలుకోవాలి.
– మహేష్‌బాబు
కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రమాద ఘటన గురించి విని నా హదయం ముక్కలైంది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నా
– అల్లు అర్జున్‌
ఒడిశా రైలు ప్రమాద ఘటన గురించి తెలియగానే ఒక్కసారిగా కుంగిపోయా. బాధిత కుటుంబాల గురించి తలుచుకుంటే తీవ్రమైన బాధ కలుగుతుంది.
– అనుష్క శెట్టి
రైలు ప్రమాద ఘటన నా హదయాన్ని కలచివేసింది. ఆ బాధను మాటల్లో చెప్పలేకపోతున్నా. రెస్క్యూ ఆపరేషన్‌లో సాయం చేయడానికి ముందుకు వచ్చిన స్థానికులకు కతజ్ఞతలు.
– రష్మిక

Spread the love