సమ్మక్క- సారలమ్మ, కోయ పూనెం జాతీయ వేదిక ఛైర్మెన్ గా సిద్ధబోయిన అరుణ్ కుమార్

నవతెలంగాణ -తాడ్వాయి
సమ్మక్క- సారలమ్మ జాతీయ వేదిక చైర్మన్ గా మేడారం ప్రధాన పూజారి సిద్ధబోయిన అరుణ్ కుమార్ ను నాలుగు రాష్ట్రాల కోయ ప్రతినిధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్గా అన్నవరం హనుమంతరావు ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా సమ్మక్క సారమ్మ కోయ పునెం జాతీయ కమిటీ కోఆర్డినేటర్ మహిపతి సంతోష్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ కమిటీ సమ్మక సార్లమ్మా చరిత్ర పై జాతీయ స్థాయి లో అల్ ఇండియా లో పరిశోధన చేసి పుస్తక రూపం లో చరిత్ర అందిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం లో చత్తీస్గడ్ నుండి ఆలం ఆనందరావు, వాసం చెంద్రశేఖర్, మహారాష్ట్ర నుండి శంకర్, రమేష్, ఆంధ్రప్రదేశ్ నుండి పాయం రాజేందర్, వీరబాబు, తెలంగాణ నుండి,పూజారులు, సిద్ధబోయిన సురేందర్, సిద్ధబోయిన వసంతరావు, కుర్సం రవి, చందా మహేష్, సీతక్క యువ సేన అధ్యక్షులు చేర్ప రవీందర్, సమ్మక్క సారలమ్మ రీసెర్చ్ సెంటర్ డైరెక్టర్ కాకా నర్సింగరావు, అర్రేమ్ లచుపటేల్, ఈర్ప సునీల్, తో పాటు 100 మంది వివిధ రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Spread the love