నవతెలంగాణ – జుక్కల్
హైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో ఉన్నత విద్యైన బిహెచ్ఎంఎస్ ను పూర్తి చేసుకుని తిరిగి స్వగ్రామానికి వచ్చిన భాస్కర్ ను చండేగావ్ సర్పంచ్ బండేడ్ లక్ష్మణ్ మంగళవారం సాదరంగా ఆహ్వానించి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. యువకుడు నిరుపేద వ్యవసాయ కూలీ కుటుంబంలో జన్మించాడని అన్నారు. భాస్కర్ తల్లిదండ్రులు ఎంతో శ్రమకోర్చి అతడి ఉన్నత విద్యను చదివించారని తెలిపారు. అమ్మానాన్నల కష్టం వృధా పోకుండా (బిహెచ్ఎంఎస్) డాక్టర్ గా ఎదగడం మన గ్రామానికి ఎంతో గర్వకారణమన్నారు. భాస్కర్ మన గ్రామానికే వైద్య సేవలందించడానికి రావడం మన అదృష్టమన్నారు. యువకుడిని గ్రామంలోని విద్యార్థులందరూ ఆదర్శంగా తీసుకోవాలి ఆయన సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, జీపీ కార్యదర్శి వికాస్ రెడ్డి, గ్రామ పెద్దలు, వైద్య విద్యార్థి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.
బిహెచ్ఎంఎస్ విద్యను పూర్తి చేసిన యువకుడికి సర్పంచ్ ఘన సన్మానం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



