నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని సావర్ గావ్ గ్రామపంచాయతీ పరిధిలోని పలు అభివృద్ధి పనులను కామారెడ్డి జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్ మంగళవారం పరిశీలించారని ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ రాము తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్ గ్రామంలోని అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేశారు. మొదటగా గ్రామంలోని ఉపాధి హామీ పనులను నిర్వహిస్తున్న ప్రదేశానికి వెళ్లి కూలీలతో మాట్లాడారు. కూలీల సంఖ్యను రికార్డులను పరిశీలించారు. సీసిటీ పనుల గురించి గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ సోపాన్ ను పనుల వివరాలు ఏ విధంగా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. అనంతరం గ్రామంలోని నర్సరీలో పెంచుతున్న మొక్కలు వివరాలను ఎంపీ ఓ రామును అడిగి తెలుసుకున్నారు. పని ప్రదేశం వద్ద కూలీలకు నీటి సదుపాయం, హెల్త్ కీట్, ఆర్ఎస్ పౌడర్, అందుబాటులో ఉంచాలని ఎఫ్ఏను ఆదేశించారు. సావర్ గావ్ లో నిర్వహిస్తున్న ఎన్యుమిరేషన్ చేస్తున్న సర్వేను సిబ్బందిని అడిగి వివరాలను సేకరించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా పరిషత్ సీఈవో చందర్ నాయక్, జుక్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ , ఎంపీ ఓ రాము, గ్రామ సర్పంచ్ కపిల్, ఫీల్డ్ అసిస్టెంట్ సోపాన్, జిపి కార్యదర్శి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
సావర్ గావ్ లో అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా పరిషత్ సీఈఓ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



