Sunday, August 23, 2026
E-PAPER
Homeఖమ్మంపదిలో ప్రధమ స్థానాలు సాధించిన విద్యార్థులకు బంపరాఫర్

పదిలో ప్రధమ స్థానాలు సాధించిన విద్యార్థులకు బంపరాఫర్

- Advertisement -

విజయవాడ నుంచి హైదరాబాద్ వరకు విమానంలో ఉచిత ప్రయాణం
హామీ అమలు చేసిన ఊటుకూరు ఫౌండేషన్ అధ్యక్షుడు నాగేశ్వరరావు 
విద్యార్థుల వెంట ఎంఈఓ దామాల పుల్లయ్య 
నవతెలంగాణ – బోనకల్ 

ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో ప్రధమ ద్వితీయ స్థానాలు సాధించిన విద్యార్థులకు ఉచిత విమాన ప్రయాణం చేసి విద్యార్థులలో ఆలోచనలు పట్టుదలను కల్పించారు. ఊటుకూరు ఫౌండేషన్ అధ్యక్షుడు ఊటుకూరి నాగేశ్వరరావు విద్యార్థులకు ఇచ్చిన హామీల అమలు చేసి మంగళవారం చూపించారు. మండల పరిధిలోని తూటికుంట్ల ప్రాథమిక పాఠశాలలో 12 మార్చి 2026న జరిగిన ఓ కార్యక్రమంలో తూటికుంట్ల గ్రామానికి చెందిన ఊటుకూరు ఫౌండేషన్ అధ్యక్షుడు ఊటుకూరి నాగేశ్వరరావు 10వ తరగతిలో బాలికల బాలుర విభాగంలో ప్రథమ స్థానాలను సాధించిన విద్యార్థులను ఉచితంగా విజయవాడ నుంచి హైదరాబాదు వరకు విమాన ప్రయాణం చేస్తానని హామీ ఇచ్చారు.

ఇందులో భాగంగా 10 వ తరగతిలో ఆళ్లపాడు ఉన్నత పాఠశాలకు చెందిన ఆళ్లపాడు విద్యార్థి తాళ్లూరి భాను ప్రకాష్ బాలుర విభాగంలో మండల స్థాయిలో 6 మార్కులకు గాను 560 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో నిలిచాడు. అదేవిధంగా బాలికల విభాగంలో రావినూతల ఉన్నత పాఠశాలకు చెందిన తాటికొండ చంద్రిక 6 మార్కులకు గాను 546 మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచింది. వీరిద్దరిని ఉచిత విమాన ప్రయాణ సౌకర్యం వరించింది.

తాళ్లూరి భాను ప్రకాష్, తాటికొండ చంద్రికలను తీసుకొని మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్య, ఊటుకూరు నాగేశ్వరరావు విజయవాడలోనే గన్నవరం విమానాశ్రయానికి వెళ్లారు. అక్కడ విమానంలో ఎక్కి హైదరాబాదు వెళ్లారు. హైదరాబాదు నుంచి తిరిగి మంగళవారం రాత్రి స్వగ్రామాలకు చేరారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలకరించగా తమకు ఎంతో సంతోషంగా ఆనందంగా గర్వంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తాము విమానం ఎక్కుతామని జీవితంలో ఊహించలేదని కానీ అతి తక్కువ వయసులోనే విమానంలో ప్రయాణం చేయటం ఎంతో అనుభూతి కలిగిందన్నారు. తమకు పదవ తరగతిలోనే విమానం యొక్క అవకాశాన్ని కల్పించిన ఓటుకూరు ఫౌండేషన్ అధ్యక్షులు ఊటుకూరి నాగేశ్వరరావుకి మండల విద్యాశాఖ అధికారి దామాల పుల్లయ్యకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -