Tuesday, May 12, 2026
E-PAPER
Homeజాతీయంమ‌హిళా రెజ‌ర్ల‌పై లైంగిక వేధింపు కేసు.. ద‌ర్యాప్తు అధికారి వాంగ్మూలం న‌మోదు

మ‌హిళా రెజ‌ర్ల‌పై లైంగిక వేధింపు కేసు.. ద‌ర్యాప్తు అధికారి వాంగ్మూలం న‌మోదు

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: మ‌హిళా రెజ‌ర్ల‌ల‌ను లైంగిక వేధింపుల‌కు గురి చేసిన‌ట్లు బీజేపీ ఎంపీ, మాజీ భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై 2023 ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన విష‌యం తెలిసిందే. రెజ‌ర్లంతా ఢిల్లీలోని జంత‌ర్‌మంత‌ర వ‌ద్ద భారీ యోత్తున నిర‌స‌న చేపట్టారు. వారి ఆందోళ‌ల‌న‌కు దేశ‌మంతా మ‌ద్ద‌తు ల‌భించింది. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు న‌మోదు చేశారు. ఆ త‌ర్వాత స‌మ‌గ్ర ద‌ర్యాప్తు కోసం సిట్‌ను ఏర్పాటు చేశారు. ప్ర‌ముఖ రెజ్ల‌ర్ ఒలింపిక్ ప‌త‌క విజేత వినేష్ ఫొగ‌ట్ త‌న ప‌త‌కాన్ని కూడా వాప‌స్ ఇచ్చారు. తాజాగా ఈక్ర‌మంలోనే మంగ‌ళవారం ఢిల్లీ రోజ్ రెవిన్యూ కోర్టు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ద‌ర్యాప్తు అధికారికి సంబంధించిన స్టేట్‌మెంట్‌ను అద‌న‌పు న్యాయ‌మూర్తి అశ్వని పన్వార్ న‌మోదు చేశారు.. అందుకు సంబంధించిన కేసును ఈ నెల 15, 19న కేసు లిస్టింగ్ ఇచ్చింది కోర్టు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -