నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని బస్వాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ మెయిన్ రోడ్ మజీద్ వరకు గల పవర్ సప్లై ఓవర్ లోడ్ కావడంతో నిత్యం పవర్ సప్లై సమస్యతో గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్య వలన. 15. కె.వి డిపిఆర్ ఉండడం వలన ఓవర్ లోడ్ సమస్య ఎక్కువ కావడం తో జుక్కల్ విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి గ్రామ సర్పంచ్ వి. రమణ సురేష్ గొండ తీసుకపోవడంతో విద్యుత్ శాఖ అధికారులు స్పందించి 25 కె.వి డి పి ఆర్ ట్రాన్స్ఫార్మర్ తెచ్చి బిగించినారు. సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేసి అధికారులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ బస్వాపూర్ గ్రామ లైన్ మ్యాన్. మారుతి, గ్రామ జిపి వర్కర్ దత్త రెడ్డి, గ్రామస్తులు కలిసి 25 కే.వి డి పి ఆర్ ట్రాన్స్ఫారం బిగించి విద్యుత్ సమస్యను పరిష్కరించినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.
విద్యుత్ ఓవర్ లోడ్ సమస్యను పరిష్కరించిన సర్పంచ్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



