– సీపీఐ( ఎంఎల్) మాస్ లైన్ నేత గోకినపల్లి ప్రభాకర్
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని దిబ్బగూడెం పంచాయతీ ఆవాస గ్రామం గాడ్రాల కు చెందిన సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ సీనియర్ నాయకుడు కామ్రేడ్ కాక భూపతి అనారోగ్యంతో మృతిచెందారు.ఆయన మృతి పట్ల ఆదివారం గ్రామంలో సంతాప సభ నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు.
ధర్ముల శ్రీరాములు అధ్యక్షతన జరిగిన ఈ సభలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గోకినపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ, కామ్రేడ్ కాక భూపతి 1980 సంవత్సరం నుంచి సుమారు 46 సంవత్సరాల పాటు పార్టీకి అంకితభావంతో సేవలందించారని గుర్తు చేశారు. ఉమ్మడి నందిపాడు పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో జరిగిన పోడు భూముల పోరాటాల్లో ఆయన కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆయన మరణం పార్టీకి, ప్రజా ఉద్యమాలకు, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు తీరని లోటని అన్నారు. కాక భూపతి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు కాక భూపతి మృతదేహానికి పూలమాలలు వేసి, ఎర్రజెండా కప్పి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా) మండల నాయకులు కారం మల్లేష్, కారం రాజులు, ధర్ముల రాంబాబు, గ్రామ నాయకులు సున్నం రామారావు, కుంజా జోగ్గయ్య, జెడ్డి నారాయణ, పెడకం లక్ష్మయ్య, జెడ్డి ముత్యాలు, కాక బాబు, కాక లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.



