Tuesday, May 5, 2026
E-PAPER
Homeఆదిలాబాద్నూతన తహశీల్దార్ ను సన్మానించిన సర్పంచులు 

నూతన తహశీల్దార్ ను సన్మానించిన సర్పంచులు 

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
కుభీర్ మండల నూతన తహశీల్దార్ గా శ్రీదేవి భాద్యతలు చేపట్టిన విషయ తెలిసిందే. ఇందులో భాగంగా మండల పరిధిలోని కొన్ని గ్రామాల సర్పంచ్ లు మంగళవారం తహశీల్దార్ కార్యాలయంలోశాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుభీర్ మండలం అతి పెద్ద మండలం అని తెలిపారు. ఇందులో అధికంగా గిరిజన పేద మధ్య తరగతి ప్రజలు అధికంగా నివసిస్తుంటారని అన్నారు. వారికి ఎల్లవేళలా మీరు అందుబాటులో ఉండి ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆమె సానుకూలంగా స్పందించి మండలంలో అందుబాటులో ఉండి  రైతులకు, విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు జరగకుండా అన్ని చర్యలు చేపడతానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు, మడి ప్రవీణ్, రజిత దేవేందర్, జీవన్ పల్సి ఉప సర్పంచ్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -