
నవతెలంగాణ – సిద్దిపేట
సిద్దిపేట జిల్లాలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలల్లో ఇంటర్మీడియట్ లో ప్రవేశాలకు శనివారం సిద్దిపేట అర్బన్ మండలంలోని మిట్టపల్లి రెసిడె న్షియల్ పాఠశాల/ కళాశాలలో విద్యార్థులకు స్పాట్ అడ్మి షన్ నిర్వహిస్తున్నట్లు మెదక్ ఈస్ట్ రీజియన్ ప్రాంతీయ సమన్వయకర్త కె.నిర్మల తెలిపారు.
గురువారం ఆమె మాట్లాడుతూ.. కళాశాలలో చేరే విద్యార్థులు ఎస్సెస్సీ రెగ్యులర్ గా ఉత్తీర్ణత సాధించాల న్నారు. మెదక్ ఈస్ట్ రీజియన్ పరిధిలోని ఆల్వాల గురుకుల బాలుర కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 14, చేర్యాల బాలుర కళాశాలలోని సీఈసీ గ్రూప్ 26, చిన్నకోడూరు (కోహెడ) బాలుర కళాశాలలో ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 28, దుబ్బాక బాలుర కళాశాలలోని బైపీసీ గ్రూపులో 16, హుస్నాబాద్ బాలుర కళాశాలలో ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో 28, కోహెడ బాలుర కళాశాలలో బైపీసీ గ్రూపుల్లో 17, కొండపాక బాలుర కళాశాలలోని ఎంపీసీ గ్రూపులో 20, వర్గల్ బాలుర కళాశాలలోని ఎంపీసీ గ్రూపులో 24 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. బెజ్జంకిలోని (హుస్నా బాద్) బాలికల గురుకుల కళాశాలలో ఎంఈసీ, సీఈసీ గ్రూపుల్లో 51, రామక్కపేట బాలికల కళాశాలలో సీఈసీ గ్రూపులో 17, జగదేవ్పూర్(కొండపాక) బాలికల ఒకేషనల్ గ్రూప్లో 31,జగదేవ్పూర్(కొండపాక) బాలికల కళాశాలలో బైపీసీ గ్రూపుల్లో 9, గజ్వేల్ బాలికల కళాశాలలో ఎంపీసీ గ్రూపుల్లో 8, సిద్దిపేట రూరల్ బాలికల కళాశాలలో ఎంపీసి , బైపీసీ గ్రూపుల్లో 19 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. శనివారం ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్పాట్ అడ్మిషన్ లు జరుగుతాయని, 12 గంటల తరువాత సీట్ల కేటాయింపు ఉంటుందని, ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకో వాలని సూచించారు.