– వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
నవతెలంగాణ-వరంగల్
ఆడపిల్లలను రక్షించండి ఆడపిల్లలకు చదువు చెప్పించండి అనే నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. వరంగ ల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన బేటి బచావో-బేటి పడ్డావో కార్యక్రమాన్ని బుధవారం జిల్లా స్త్రీ,శిశు సంక్షేమశాఖ అధ్వర్యంలో సమీక్షా సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భేటీ బచావో భేటీ పడావో కార్యక్రమాన్ని దేశంలోనే బాలికల సంక్షేమం కోసం వారి చదువుల కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పథకంఅని,ఈ పథకం 2015లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించారని అన్నారు.ఈ కార్యక్రమం వరంగల్ జిల్లాలో మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేయడం జరిగిందని, ఇందుకు గాను యాక్షన్ ప్లాన్ తయారు చేయాలని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారి శారద ను ఆదేశించారు.ఇందులో జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా వైద్యాధికారి, జిల్లా రూరల్ డెవల్మెంట్ ఆఫీసర్, జిల్లాయూత్ స్పోర్ట్స్ అధికారి, పోలీస్ డిపార్ట్మెం ట్ , మెప్మా, జిల్లా స్కిల్ డెవలప్మెంట్ అధికారి, జిల్లా పంచాయితీ రాజ్ అధికారి, జిల్లా ఎస్సీ డెవలప్‌మెంట్ అధికారి, జిల్లా బిసి డెవలప్మెంట్ అధికారి, జిల్లా ఎస్టీ డెవలప్‌మెంట్ అధికారి, జిల్లామైనారిటీ డెవలప్మెంట్ అధికారులు ఉన్నారని వారు బీటీ బచావో బీటీ పడావో నినా దాన్ని ప్రజలకు తెలిసేలా అవేర్నెస్ తీసుకు రా వాలన్నారు. బాల,బాలికలు రేషియో 2011 జాతీ య జనాభా లెక్కలను చూసిన ట్లయితే ప్రతి1000 మంది అబ్బాయిలకి అమ్మాయిల సంఖ్య 932 గా ఉన్నదని, ఈ సంఖ్యను పెంచేలా ప్రజల్లో చైతన్యం తీసుకు రావాలని జిల్లా కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బీటీ బచావో – బీటీ పడావో పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లోకల్ బాడీ అశ్విని తానాజీ వాకాడే, డీఈవో వాసంతి, డీఎంహెచ్‌వో వెంకటరమణ, నెహ్రూ యువ కేంద్రం కోఆర్డినేటర్ అన్వేష్, డీవైఎస్‌ఓఅశోక్, సీడీపీఓలు, డిహెచ్‌ఈడబ్ల్యూ జెండర్ స్పెషాలి, డిహెచ్‌ఈడబ్ల్యూ, కో ఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.